Realme C63 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో లాంచైన రియల్మీ సీ63 5జీ

Highlights

  • భారత్ లో Realme C63 5G లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ప్రారంభ ధర రూ.10,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో సీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme C63 5G పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C63 5G ధర, లభ్యత

Realme C63 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.

Realme C63 5G యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధరను రూ.10,999 గా పెట్టారు.

Realme C63 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మిడ్ వేరియంట్ ధరను రూ.11,999 గా పెట్టారు.

Realme C63 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ ను రియల్మీ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో బేస్ మోడల్‌ను రూ.9,999 కి, మిడ్ వేరియంట్‌ను రూ.10,999 కి, టాప్ మోడల్‌ను రూ.11,999 కి సొంతం చేసుకోవచ్చు.

Realme C63 5G యొక్క సేల్ ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ పై మొదలవుతుంది.

Realme C63 5G డివైజ్ స్టారీ గోల్డ్ మరియు ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme C63 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C63 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ ఐ కంఫర్ట్ డిస్ప్లే, డైనమిక్ 50హెర్ట్జ్, 60హెర్ట్జ్, 90హెర్ట్జ్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్స్ ఉంటాయి.

చిప్సెట్: Realme C63 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Realme C63 5G స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ. ఈ ఫోన్ లో 8జిబి డైనమిక్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Realme C63 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32ఎంపి ఏఐ మెయిన్ కెమెరా అందించారు. దీంతో పాటు ఒక సెకండరీ లెన్స్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Realme C63 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ క్విక్ చార్జ్ టెక్నాలజీతో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme C63 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C63 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, 9 5జీ బ్యాండ్స్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme C63 5G లో ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.