Realme C63: గ్లోబల్‌గా లాంచైన రియల్మీ సీ63

Highlights

  • గ్లోబల్‌గా Realme C63 లాంచ్
  • ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme గ్లోబల్‌గా ఒక కొత్త సీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C63 పేరుతో ఈ ఫోన్ ఇండోనేషియా, మలేషియా మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ చిప్సెట్, 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Realme C63 ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C63 ధర, లభ్యత

Realme C63 స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను IDR 19,99,000 (సుమారు రూ.10,257) గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర IDR 22,99,000 (సుమారు రూ.11,800) గా ఉంది.

Realme C63 స్మార్ట్‌ఫోన్ జూన్ 5వ తేదీ నుంచి ఇండోనేషియా మరియు మలేషియాల్లో సేల్‌కి వస్తోంది.

Realme C63 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C63 లో హెచ్డీ+ (1604*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్, 560 నిట్స్ హై బ్రైట్నెస్, 90.3% స్క్రీన్-టు-బాడీ రేషియో, 180హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C63 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme C63 లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Realme C63 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Realme C63 లో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme C63 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme C63 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, బీడీఎస్, ఏజీపీఎస్, యూఎస్బీ టైప్ సీ 2.0 పోర్ట్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Realme C63 డివైజ్ 167.26 మి.మీ పొడవు, 76.67 మి.మీ వెడల్పు, 7.74 మి.మీ మందం, 189 గ్రాముల బరువు (జేడ్ గ్రీన్), 191 గ్రాముల (లెదర్ బ్లూ) బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Realme C63 లో మోనో స్పీకర్, వన్-మైక్ నాయిస్ క్యాన్సలేషన్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.

Previous articleVivo V40 Lite ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు
Next articleVivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.