Home News Realme C65 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్

Realme C65 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్

Highlights
  • భారత్‌లో Realme C65 5G లాంచ్
  • 6.67-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే
  • ప్రారంభ ధర రూ.10,499

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Realme తాజాగా భారత్ లో ఒక కొత్త సీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme C65 5G పేరుతో ఈ ఫోన్ భారత్‌లోకి వచ్చింది. రియల్మీ సీ65 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి రియల్మీ సీ65 5జీ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme C65 5G ధర మరియు లభ్యత

Realme C65 5G డివైజ్ మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.10,499 గా ఉంది.

4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.11,499 గా నిర్ణయించారు.

6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా యూజర్లకు రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Realme C65 5G డివైజ్ ఫెదర్ గ్రీన్ మరియు గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ.కామ్ ద్వారా రియల్మీ సీ65 5జీ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Realme C65 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C65 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 720*1604 పిక్సెల్స్ రెజుల్యూషన్, 89.97% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ హై బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C65 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme C65 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో డైనమిక్ టెక్నాలజీ ద్వారా అందించారు.

కెమెరా: Realme C65 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: Realme C65 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ క్విక్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Realme C65 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme C65 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎయిర్ జెశ్చర్, రెయిన్‌డ్రాప్ స్మార్ట్ టచ్, డైనమిక్ బటన్, స్మార్ట్ కోడ్ స్కాన్, మినీ క్యాప్సూల్ 2.0, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ఉన్నాయి.