Realme C65 5G: భారత్‌లో లాంచైన రియల్మీ సీ65 5జీ స్పీడీ రెడ్ కలర్ వేరియంట్

Highlights

  • 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా
  • Realme C65 5G ధర రూ.10,499
  • జూన్ 14 నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం Realme C65 5G ఫోన్ లాంచ్ అయ్యింది. తాజాగా స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ లో ఈ ఫోన్‌ని లాంచ్ చేశారు. ఈ కలర్ లో ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కలర్ మార్పు తప్పా, ఇతర స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఓసారి స్పీడీ రెడ్ కలర్ వేరియంట్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme C65 5G ధర, లభ్యత

Realme C65 5G స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme C65 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.10,499 గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 12,499 గా నిర్ణయించారు.

Realme C65 5G స్పీడీ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మీ అధికార వెబ్‌సైట్ ద్వారా జూన్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Realme C65 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme C65 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 720*1604 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme C65 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Realme C65 5G డివైజ్ 6జిబి/4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి డైనమిక్ ర్యామ్ ఫీచర్ ను ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Realme C65 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme C65 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ క్విక్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme C65 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme C65 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎయిర్ జెశ్చర్, రెయిన్‌డ్రాప్ స్మార్ట్ టచ్, డైనమిక్ బటన్, స్మార్ట్ కోడ్ స్కాన్, మినీ క్యాప్సూల్ 2.0, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.