Home News సూపర్ డీల్: ఈ Realme 5G ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి

సూపర్ డీల్: ఈ Realme 5G ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోండి

హైలైట్స్:

తన అభిమానుల కొరకు ప్రముఖ కంపెనీ రియల్ మీ, రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ సందర్భంగా రియల్ మీ స్మార్ట్ ఫోన్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ పై భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 28 వరకు రియల్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ కొనసాగనుంది. ఈ ఫెస్టివల్ బెనిఫిట్స్ ని రియల్ మీ ఇండియా వెబ్ సైట్ ద్వారా మరియు అమెజాన్ ఇండియా షాపింగ్ ప్లాట్ఫామ్ పై పొందవచ్చు. ఇక ఈ సేల్ సందర్భంగా రియల్ మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మాంచి డీల్స్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ ని ఎంతో తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం వచ్చేసింది. ఇక్కడ మీకోసం రియల్ మీ 9 ప్రో 5జీ ఫోన్ కి సంబంధించిన డీల్స్, డిస్కౌంట్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అందిస్తున్నాం. చూసేయండి.

Realme 9 Pro 5G ఆఫర్స్

రియల్ మీ 9 ప్రో 5జీ రూ.18,999 ధరతో ప్రారంభమవుతోంది. పూర్తి నగదుని చెల్లించి కొనేవారికి రియల్ మీ 9 ప్రో 5జీ పై రూ.2000 డిస్కౌంట్ లభించనుంది. ఈ ఆఫర్ తో రియల్ మీ 9 ప్రో 5జీ ని మీరు రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జిబి వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభ్యమవుతుంది.

Realme 9 Pro 5G స్పెసిఫికేషన్స్

రియల్ మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉన్నాయి. ఇప్పుడు కెమెరా విభాగంపై ఓ కన్నేద్దాం. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు రియల్ మీ 9 ప్రో 5జీ ఫోన్లో ముందు వైపున 16 ఎంపి కెమెరాను అమర్చారు. రియల్ మీ 9 ప్రో 5జీ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఈ ఫోన్లో ఉంది. రియల్ మీ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Realme 9 pro 5G Specs