ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్ లో Realme GT 3 ని సందరు సంస్థ పరిచయం చేసింది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Realme GT 3 డివైజ్ అఫీషియల్ టీజర్ ఇమేజ్ ని షేర్ చేశారు. 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న తొలి ఫోన్ Realme GT 3 కావడం విశేషం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్ గా Realme GT 3 పరిగణించబడుతోంది.
అతి త్వరలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. అయితే ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థమవుతోంది. అయితే భారత్ లో Realme GT 3 లాంచ్ కి సంబంధించి రియల్మీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Realme GT 3 గ్లోబల్ లాంచ్ తేదీ
Realme GT 3 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా జూన్ 14 న లాంచ్ అవ్వనుందని లీకైన పోస్టర్ ద్వారా తెలుస్తోంది. టిప్‌స్టర్ పారస్ గుగ్లాని ఈ పోస్టర్ ని షేర్ చేశారు. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Realme GT 3 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme GT 3 లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, 93.69 పర్సెంట్ కాంట్రాస్ట్ రేషియో, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.07 బిలియన్ కలర్స్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme GT 3 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4ఎన్ఎమ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ పై తయారైంది. దీనిలో అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT 3 స్మార్ట్ ఫోన్ 8జిబి+128జిబి, 12జిబి+256జిబి, 16జిబి+256జిబి, 16జిబి+512జిబి, 16జిబి+1టిబి వేరియంట్స్ లో లభించనుంది.
- ఓఎస్, బ్యాటరీ: Realme GT 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- కనెక్టివిటీ: Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- కెమెరా: Realme GT 3 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 సెన్సర్, ఓఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మైక్రోస్కోప్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
