
Realme బ్రాండ్ త్వరలోనే తన ఫ్లాగ్షిప్ జీటీ సిరీస్ స్మార్ట్ ఫోన్ Realme GT 5 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, కంపెనీ వరుసబెట్టి ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని షేర్ చేస్తూ వస్తోంది. లేటెస్ట్ టీజర్ లో 1టిబి స్టోరేజీ, 240 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని రియల్మీ కన్ఫర్మ్ చేసింది. సరే, ఓసారి Realme GT 5 యొక్క తాజా విశేషాలు తెలుసుకుందాం.
Realme GT 5 కొత్త టీజర్ విశేషాలు
- Realme GT 5 యొక్క రెండు కొత్త టీజర్ల ద్వారా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. దీంతో చార్జింగ్ సపోర్ట్, స్టోరేజీ వివరాలు బయటకు వచ్చాయి.
- ఇమేజ్ ద్వారా Realme GT 5 1టిబి స్టోరేజీ వేరియంట్ లో లభించనుందని తెలుస్తోంది.
- రెండో పోస్టర్ ద్వారా Realme GT 5 డివైజ్ 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.
- అంతకు ముందే రివీలైన టీజర్ ద్వారా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ చిప్ తో వస్తుందని తెలిసింది. అంటే, ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానుందని భావిస్తున్నారు.
Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నారు.
- స్టోరేజీ: Realme GT 5 లో 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ అందిస్తున్నారు.
- కెమెరా: Realme GT 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Realme GT 5 లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ గల మరొక వేరియంట్ కూడా లాంచ్ కానుంది.
- ఓఎస్: Realme GT 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.











