Realme GT 5 గ్లోబల్ లాంచ్ ఖరారు; రిలీజైన టీజర్!

Highlights

  • ఆగస్టు 28 న చైనాలో లాంచ్ అవుతోన్న Realme GT 5
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో వస్తోన్న డివైజ్
  • 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆఫర్ చేయనున్న Realme GT 5

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ త్వరలోనే Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఆగస్టు 28 వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అవుతోంది. తాజాగా రియల్మీ సంస్థ Realme GT 5 గ్లోబల్ లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. చైనా కాకుండా ఇతర మార్కెట్స్ లో Realme GT 5 లాంచ్ కి సంబంధించిన కొత్త టీజర్ ని రియల్మీ విడుదల చేసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Realme GT 5 గ్లోబల్ లాంచ్

  • రియల్మీ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై Realme GT 5 యొక్క గ్లోబల్ లాంచ్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది.
  • త్వరలోనే Realme GT 5 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు టీజర్ ద్వారా తెలియజేశారు.
  • Realme GT 5 డివైజ్ ని కింగ్ ఆఫ్ పెర్ఫామెన్స్ అని రియల్మీ తన టీజర్ లో పేర్కొంది. అలాగే టైమ్ టు లీప్ అప్ అని కూడా మెన్షన్ చేసింది.
  • Realme GT 5 స్మార్ట్ ఫోన్ ని రియల్మీ సంస్థ తన 5 వ యానివర్శరీ సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
  • ఆగస్టు 28 న Realme GT 5 డివైజ్ ని చైనాలో లాంచ్ అవ్వనుందని కన్ఫర్మ్ అయ్యింది.

Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే ప్రో ఎక్స్‌డీఆర్ హై డైనమిక్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ సపోర్ట్, ఎంబెడెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్7 డిస్ప్లే చిప్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Realme GT 5 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో 740 జీపీయూ ఉంటాయి.
  • స్టోరేజీ: Realme GT 5 లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఇకపోతే ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Realme GT 5 డివైజ్ రెండు బ్యాటరీ మోడల్స్ ని ఆఫర్ చేస్తుంది. అందులో ఒకటి 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ + 4600 ఎంఏహెచ్ బ్యాటరీ వేరియంట్ కాగా, మరొకటి 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ + 5240 ఎంఏహెచ్ బ్యాటరీ మోడల్.
  • ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Previous articleRealme C51 లాంచ్‌ని టీజర్ ద్వారా ఖరారు చేసిన కంపెనీ
Next articleలీకైన Vivo V29e భారత మార్కెట్ ధర, మెమొరీ వేరియంట్స్!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.