
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme నేడు చైనాలో Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ Realme GT 3 కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Realme GT 5 డివైజ్ 24జిబి వరకు ర్యామ్, 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో రావడం విశేషం. Nubia RedMagic 8S Pro+, OnePlus Ace 2 pro తర్వాత 24జిబి ర్యామ్ తో వచ్చిన ఫోన్ గా Realme GT 5 నిలిచింది. ఇకపోతే ఈ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది.
Realme GT 5 స్మార్ట్ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme GT 5 ధర
- Realme GT 5 స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB (సుమారు రూ.34,500) గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 3,299 (సుమారు రూ.37,400) గా నిర్ణయించారు.
- 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ + 240W చార్జింగ్ మోడల్ ధర RMB 3,799 (సుమారు రూ.43,600) గా ఉంది.
- చైనాలో సెప్టెంబర్ 4 నుంచి Realme GT 5 సేల్ మొదలవుతుంది.
- Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్ ఇల్యూషన్ మిర్రర్ (సిల్వర్), స్టారీ ఒయాసిస్ (గ్రీన్) కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Realme GT 5 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ ప్రో-ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 93.7 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 450పీపీఐ, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.46ఎంఎం సన్నని బెజెల్స్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, ఎక్స్7 ఇండిపెండెంట్ డిస్ప్లే చిప్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 డివైజ్ లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Realme GT 5 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- రియర్ కెమెరా: Realme GT 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: Realme GT 5 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5240 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో మరొక వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
- ఇతర ఫీచర్లు: Realme GT 5 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ, హై-రెజ్ ఆడియో, డాల్బీ అట్మాస్, వర్ల్‌విండ్ మెమొరీ ఇంజిన్ 2.0 వంటివి ఉన్నాయి. వర్ల్‌విండ్ టెక్నాలజీ వల్లన 76 యాప్స్ ని బ్యాగ్రౌండ్ లో మెమొరీలో ఉంచుకోవచ్చని కంపెనీ చెబుతోంది.











