
Realme GT 5 Pro స్మార్ట్ పోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు చాలా వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme GT 5 Pro లో సోని ఎల్‌వైటీఏ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తున్నట్లు ఇదివరకే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా కంపెనీ ఒక ప్రో అని రాసి ఉన్న టీజర్ ఇమేజ్ నెట్టింట్లో వదిలింది. దీంతో త్వరలోనే Realme GT 5 Pro లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.
నవంబర్ ఆఖర్లో Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లేదా డిసెంబర్ ఆరంభంలో ఈ డివైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పటివరకు Realme GT 5 Pro గురించి తెలిసిన వివరాలను తెలుసుకుందాం.
లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro యొక్క రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్ చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై షేర్ చేసింది. పోస్ట్ ప్రకారం, Realme GT 5 Pro డివైజ్ Sony Lytia LYT808 సెన్సర్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే కెమెరా సెన్సర్ తో OnePlus 12 కూడా మార్కెట్ లోకి వస్తోంది.
ఇంకా Realme GT 5 Pro లో 8ఎంపి ఒమ్నివిజన్ ఒవివో8డి10 అల్ట్రావైడ్ లెన్స్, ఒక ఐఎంఎక్స్890 పెరిస్కోప్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. గతంలో TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన కెమెరా స్పెసిఫికేషన్స్ ప్రకారం, Realme GT 5 Pro లో 50ఎంపి ప్రైమరీ లెన్స్, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. ఇక 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.82-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్, అడ్రెనో 750 జీపీయూ ఉంటాయి.
- మెమొరీ: Realme GT 5 Pro డివైజ్ 12జిబి/16జిబి/24జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుందని అంచనా.
- సాఫ్ట్‌వేర్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Realme GT 5 Pro లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Realme GT 5 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
- చుట్టు కొలత, బరువు: Realme GT 5 Pro డివైజ్ 161.6 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 9.2 మి.మీ మందం, 220 గ్రాముల బరువు ఉంటుంది.












