Home News లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్; Sony-LYTIA సెన్సర్‌తో వచ్చే అవకాశం!

లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్; Sony-LYTIA సెన్సర్‌తో వచ్చే అవకాశం!

Highlights
  • తాజాగా లీకైన Realme GT 5 Pro రియర్ కెమెరా స్పెక్స్
  • ఈ ఏడాది ఆఖర్లో డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఫోన్

Realme GT 5 Pro స్మార్ట్ పోన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అఫీషియల్ లాంచ్ కి ముందు చాలా వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అవుతూ వస్తున్నాయి. తాజాగా రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. Realme GT 5 Pro లో సోని ఎల్‌వైటీఏ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో వస్తున్నట్లు ఇదివరకే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా కంపెనీ ఒక ప్రో అని రాసి ఉన్న టీజర్ ఇమేజ్ నెట్టింట్లో వదిలింది. దీంతో త్వరలోనే Realme GT 5 Pro లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

నవంబర్ ఆఖర్లో Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లేదా డిసెంబర్ ఆరంభంలో ఈ డివైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పటివరకు Realme GT 5 Pro గురించి తెలిసిన వివరాలను తెలుసుకుందాం.

లీకైన Realme GT 5 Pro కెమెరా స్పెసిఫికేషన్స్

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro యొక్క రియర్ కెమెరా స్పెసిఫికేషన్స్ చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై షేర్ చేసింది. పోస్ట్ ప్రకారం, Realme GT 5 Pro డివైజ్ Sony Lytia LYT808 సెన్సర్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే కెమెరా సెన్సర్ తో OnePlus 12 కూడా మార్కెట్ లోకి వస్తోంది.

ఇంకా Realme GT 5 Pro లో 8ఎంపి ఒమ్నివిజన్ ఒవివో8డి10 అల్ట్రావైడ్ లెన్స్, ఒక ఐఎంఎక్స్890 పెరిస్కోప్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. గతంలో TENAA లిస్టింగ్ ద్వారా రివీలైన కెమెరా స్పెసిఫికేషన్స్ ప్రకారం, Realme GT 5 Pro లో 50ఎంపి ప్రైమరీ లెన్స్, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. ఇక 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.

Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)