ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా Realme GT 5 Pro బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. దీంతో Realme GT 5 Pro యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. సరే, ఓసారి Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ మరియు గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Realme GT 5 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు
- మైస్మార్ట్‌ప్రైస్ Realme GT 5 Pro యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ స్క్రీన్‌షాట్ ని తన కథనం ద్వారా పంచుకుంది.
- దాని ప్రకారం, Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- అయితే ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే Realme GT 5 Pro డివైజ్ RMX3888 అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ పై లిస్టైంది.
- Realme GT 5 Pro గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1229 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4699 పాయింట్లు నమోదు చేసింది.
- రీసెంట్ గా లిస్టైన ఇతర అప్‌కమింగ్ స్మార్ట్ఫోన్లతో పోల్చితే ఈ గీక్‌బెంచ్ స్కోర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme GT 5 Pro లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- మెమొరీ: Realme GT 5 Pro లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని లైవైటీ-టీ808 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఒమ్నివిజన్ ఒవి0810 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
- సాఫ్ట్వేర్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
