
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme చైనీస్ మార్కెట్ లో Realme GT 5 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, ఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సర్ వంటి స్పెసిఫికేషన్స్ Realme GT 5 Pro లో ఉన్నాయి. ప్రస్తుతం Realme GT 5 Pro డివైజ్ ని చైనీస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ జేడీ.కామ్ మరియు టీమాల్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ కి అందుబాటులో ఉంటాయి.
Realme GT 5 Pro ధర, లభ్యత
- Realme GT 5 Pro డివైజ్ యొక్క ప్రీ-ఆర్డర్స్ చైనాలో డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతాయి.
- Realme GT 5 Pro డివైజ్ ఆరెంజ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Realme GT 5 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3,399 యువాన్లు (సుమారు రూ.39,800) గా ఉంది. ప్రీ-ఆర్డర్ చేసే వారికి 3,298 యువాన్లు (సుమారు రూ.38,670) కి లభించనుంది.
- Realme GT 5 Pro 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3,699 యువాన్లు (సుమారు రూ.43,379) గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ డివైజ్ 3,598 యువాన్ల (సుమారు రూ.42,194) కి లభించనుంది.
- Realme GT 5 Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,800) గా ఉంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ ని 3,898 యువాన్ల (సుమారు రూ.45,700) కి సొంతం చేసుకోవచ్చు.
- Realme GT 5 Pro టాప్ మోడల్ 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ధర 4,299 యువాన్లు (సుమారు రూ.50,400) గా ఉంది. ప్రీ-ఆర్డర్ చేసుకునే వారు ఈ ఫోన్ ని 4,198 యువాన్ల (సుమారు రూ.49,000) కి సొంతం చేసుకోవచ్చు.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Realme GT 5 Pro లో 6.78-ఇంచ్ బీఓఈ ఓఎల్ఈడీ డిస్ప్లే, కర్వ్డ్ కార్నర్స్, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 808 ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్890 పెరిస్కోప్ టెలీఫోటో 3x లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme GT 5 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ 3.2 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Realme GT 5 Pro డివైజ్ 161.72 మి.మీ పొడవు, 75.06 మి.మీ వెడల్పు, 9.23 మి.మీ మందం, 218 గ్రాముల బరువు ఉంటుంది. గ్లాస్ వేరియంట్ 224 గ్రాముల బరువు ఉంటుంది.











