ఎన్నో రూమర్లు, లీక్స్ తర్వాత Realme సంస్థ చైనాలో Realme GT 5 డివైజ్ ని లాంచ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా లాంచ్ కానుందని కంపెనీ టీజ్ చేస్తోంది. ఇదిలా ఉండగా, రియల్మీ సంస్థ మరోవైపు Realme GT 5 Pro పై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ రానున్న కొన్ని నెలల్లో చైనాలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా టిప్‌స్టర్ రివీల్ చేసి సమాచారం ఎంటో తెలుసుకుందాం పదండి.
2023 ద్వితీయార్థంలో Realme తన GT సిరీస్ ని లాంచ్ చేస్తానని తెలిపింది. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. వాటిని బట్టి, ఈ రియల్మీ ఫోన్‌కి OnePlus 12 తో పోలికలు ఉన్నాయనిపిస్తోంది. అయితే ఇరు సంస్థలు కూడా తమ ఫోన్లకు విభిన్నమైన డిజైన్ ఇవ్వడం ఖాయం. ఇప్పుడు లీకైన Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Realme GT 5 Pro డివైజ్ లో ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీడబ్ల్యూఎమ్ డీసీ డిమ్మింగ్, మెటల్ ఫ్రేమ్ ఉంటాయి.
- చిప్సెట్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT 5 Pro లో 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Realme GT 5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్9 సిరీస్ ప్రైమరీ కెమెరా, 64ఎంపి ఓవీ64బి పెరిస్కోప్ లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) ఉంటాయి.
- ఓఎస్: Realme GT 5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Realme GT 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
