
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. లాంచ్‌కి ముందు ఈ ఫోన్ యొక్క ఎన్నో స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఖరారయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి కన్ఫర్మ్ అయిన స్పెసిఫికేషన్స్ ఏవో తెలుసుకుందాం పదండి.
Realme GT 6 స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)
Realme GT 6 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోందని రియల్మీ సంస్థ కన్ఫర్మ్ చేసింది.
Realme GT 6 డివైజ్ అంటుటు స్కోర్ 1.65 మిలియన్ కి పైగా ఉంది. ఇకపోతే, ఈ ఫోన్ లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
ప్రపంచపు అతిపెద్ద డ్యూయల్ వీసీ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించబోతున్నట్లు రియల్మీ తెలిపింది.
Realme GT 6 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.
Realme GT 6 లో అందించిన చార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఫోన్ 10 నిమిషాల్లో 50 శాతం, 28 నిమిషాల్లో 100 శాతం చార్జ్ అవుతుంది.
Realme GT 6 లో ఉన్న బ్యాటరీ 46 గంటల టాక్ టైమ్, 8 గంటల పీయూబీజీ గేమ్‌ప్లే అందిస్తుంది.

Realme GT Neo 6 స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Realme GT Neo 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme GT Neo 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.
ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.
కెమెరా: Realme GT Neo 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.
బ్యాటరీ: Realme GT Neo 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Realme GT Neo 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.











