
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి జీటీ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 6 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ జూన్ 20వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ వివరాలను గత కొన్ని రోజులుగా రియల్మీ టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా Realme GT 6 యొక్క ఇండియన్ మార్కెట్ ధర లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Realme GT 6 ధర (లీక్)
Realme GT 6 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్ ధరను టిప్‌స్టర్ సామాజిక మాధ్యమం X ద్వారా లీక్ చేశారు. దీని ప్రకారం, ఈ ఫోన్ ధర రూ.39,999 గా ఉంటుందని తెలుస్తోంది. ఇది 12జిబి ర్యామ్ వేరియంట్ ధర అని సమాచారం. అయితే, అసలు ధర మాత్రం ఫోన్ లాంచ్ సమయంలో రివీల్ కానుంది.
Realme GT 6 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రియల్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.0 గిగాహెర్ట్జ్. ఇంకా ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీ వంటి స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి.
Realme GT 6 స్పెసిఫికేషన్స్ (లీక్)
స్క్రీన్: Realme GT 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.
ప్రాసెసర్: Realme GT 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.
ర్యామ్, స్టోరేజీ: Realme GT 6 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించనున్నారు.
కెమెరా: Realme GT 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడనున్నారు.
బ్యాటరీ: Realme GT 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో రానుంది.
ఇతర ఫీచర్లు: Realme GT 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉంటాయి.











