Home News Realme GT 6: రివీలైన రియల్మీ జీటీ6 లాంచ్ తేదీ

Realme GT 6: రివీలైన రియల్మీ జీటీ6 లాంచ్ తేదీ

Highlights
  • త్వరలో Realme GT 6 లాంచ్
  • తాజాగా రివీలైన లాంచ్ తేదీ
  • జూన్ 20న లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ-సిరీస్‌లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT 6 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా రియల్మీ జీటీ6 యొక్క లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. జూన్ 20న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ X ఖాతాపై షేర్ చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 6 లాంచ్ తేదీ టీజర్

రియల్మీ వైస్ ప్రెసిడెంట్ ఛేస్ రియల్మీ జీటీ సిరీస్ టీజర్ వీడియోను తన అఫీషియల్ X అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో ఛేస్ న్యూస్‌పేపర్ చదువుతున్నారు. ఆ పేపర్ వెనుకాల Realme GT 6 జూన్ 20న, అని రాసి ఉంది. ఈ తేదీన Realme GT 6 లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT 6 స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Realme GT 6 లో 6.78-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3GHz.

ర్యామ్, స్టోరేజీ: Realme GT 6 రెండు ర్యామ్ మోడల్స్ లో చైనాలో లాంచ్ అయ్యింది. 12జిబి + 256జిబి, 16జిబి + 256జిబి/1టిబి ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్‌లో అందించారు.

కెమెరా: Realme GT 6 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో సోని ఐఎంఎక్స్615 లెన్స్ వాడారు.

బ్యాటరీ: Realme GT 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme GT 6 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2, ఐపీ65 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి.