Realme GT 6: సోని ఎల్‌వైటీ-808 సెన్సర్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6

Highlights

  • భారత్‌లో Realme GT 6 లాంచ్
  • 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme GT 6 డివైజ్‌ని లాంచ్ చేసింది. ఇటీవలె లాంచైన రియల్మీ జీటీ 6టీ తో పోల్చితే జీటీ6 లో ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ లో ఏఐ-పవర్డ్ నైట్ మోడల్ ఫీచర్స్, సోని ఎల్‌వైటీ-808 ప్రైమరీ సెన్సర్, ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme GT 6 ధర, లభ్యత

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఓసారి వాటి ధరలు తెలుసుకుందాం.

Realme GT 6 యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.40,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.42,999 గా ఉంది. 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది.

Realme GT 6 స్మార్ట్‌ఫోన్ జూన్ 25వ తేదీ నుంచి రియల్మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఇకపోతే నేటి నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.4,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Realme GT 6 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme GT 6 లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 735 జీపీయూ ఉన్నాయి.

మెమొరీ: Realme GT 6 డివైజ్ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీస్‌తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme GT 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Realme GT 6 లో 50ఎంపి సోని ఎల్‌వైటీ-808 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్5 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Realme GT 6 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme GT 6 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, జీపీఎస్, నావిక్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme GT 6 లో ఐపీ65 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.