ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం ఫ్లాగ్షిప్ డివైజ్ Realme GT 6T 5G ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త తీసుకొచ్చాం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో Realme GT 6T 5G పై రూ.5,000 డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ మరియు ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి, పూర్తి వివరాలు తెలుసుకుందామా?
Realme GT 6T 5G ఆఫర్లు మరియు ధర
Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తోంది. అన్ని మోడల్స్ పై కంపెనీ, రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. బేస్ మోడల్ పై రూ.3,000 కూపన్ డిస్కౌంట్ ఇతర మోడల్స్ పై రూ.4,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది.
వీటితో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఎస్బీఐ యూజర్లకు సాధారణ మరియు ఈఎంఐ లావాదేవీలపై రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో, కస్టమర్లు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్‌ను కేవలం రూ.25,249 కి కొనుగోలు చేయవచ్చు.
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి + 512జిబి మోడల్స్ పై రూ.4,000 కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ వర్తిస్తాయి.
ఎక్స్‌చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే, రూ.26,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. అయితే మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.
ఆఫర్ ధర
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ = రూ.25,249
8జిబి+256జిబి = రూ.26,748
12జిబి+256జిబి = రూ.29,748
12జిబి+512జిబి = రూ.33,748
లాంచ్ ధర
8జిబి+128జిబి = రూ.30,999
8జిబి+256జిబి = రూ.32,999
12జిబి+256జిబి = రూ.35,999
12జిబి+512జిబి = రూ.39,999
Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కడ కొనాలి?
Realme GT 6T 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయండి.
Realme GT 6T 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme GT 6T 5G లో 6.78-ఇంచ్ 1.5కే డిస్ప్లే, 8టీ ఎల్టీపీవో అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 3డీ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
ప్రాసెసర్: Realme GT 6T 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు.
కెమెరా: Realme GT 6T 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Realme GT 6T 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Realme GT 6T 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, 9 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme GT 6T 5G లో ఐపీ65 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ అందించారు.
