ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme కొన్ని రోజుల క్రితం జీటీ సిరీస్ లో Realme GT 6T అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఈ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి శుభవార్త చెప్పినట్లయ్యింది. ఏకంగా రూ.4,000 కూపన్ డిస్కౌంట్ యూజర్లకు లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme GT 6T ధర, డిస్కౌంట్
Realme GT 6T 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.30,998 గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా రూ.4,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే లభించనుంది. అలాగే 12 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
256జిబి వేరియంట్ ధర రూ.32,998 గా ఉంది. దీనిపై కూడా రూ.4,000 కూపన్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
Realme GT 6T డివైజ్‌ని గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో కొనవచ్చా?
Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 6.78-ఇంచ్ హెచ్డీఆర్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 1600 నిట్స్ హై-బ్రైట్నెస్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
మంచి లైటింగ్ కండిషన్స్ లో ఈ ఫోన్ కెమెరా పనితనం బాగుంది. కానీ, డైనమిక్ రేంజ్ విషయంలో కొన్ని పరిమితులున్నాయి. అయితే, సెల్ఫీస్ లో డీటెయిల్స్, పొట్రెయిట్స్ లో ఎడ్జ్ డిటెక్షన్, అల్ట్రావైడ్ కెమెరా ఫలితాలు అంత బాగా లేవు. అలాగే మీకు టెలీఫోటో కెమెరా ఇందులో లేదు.
మీకు మంచి కెమెరా సెటప్ అక్కర్లేదని భావిస్తే, ఈ ఫోన్ సరైన డీల్ అని చెప్పవచ్చు.
మరోవైపు, దీనికి పోటీ ఐన POCO F6 లో కూడా టెలీఫోటో లెన్స్ లేదు. ఫేసీయల్ డీటెయిలింగ్ సరిగ్గా లేదు. ఇంకా బొకే ఎఫెక్ట్ నేచురల్ గా లేదు. అయితే డైనమిక్ రేంజ్, ఎడ్జ్ డిటెక్షన్ బెటర్ గా ఉన్నాయి.
మీరు గనుక టెలీఫోటో కెమెరా గల ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Realme 12 Pro+ డివైజ్‌ని ట్రై చేయవచ్చు. అయితే ఈ ఫోన్ లో పొట్రెయిట్స్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి.
