Home News Realme GT 6T: స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ

Realme GT 6T: స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ జీటీ 6టీ

Highlights
  • నేడు భారత్ లో Realme GT 6T లాంచ్
  • 8జిబి+128జిబి మోడల్ ధర రూ.30,999
  • మే 29 నుంచి అమెజాన్ ద్వారా సేల్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Realme నుంచి నేడు భారతీయ మార్కెట్ లో కొత్త జీటీ-సిరీస్ ఫోన్ లాంచ్ అయ్యింది. Realme GT 6T పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్‌ని ఈ ఫోన్ లో వాడారు. ఈ చిప్‌తో వచ్చిన మొదటి ఫోన్ రియల్మీ జీటీ 6టీ కావడం విశేషం. ఓసారి Realme GT 6T యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme GT 6T ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

Realme GT 6T డివైజ్ భారత్ లో 4 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Realme GT 6T 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.30,999 గా నిర్ణయించారు. 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.32,999 గా ఉంది. 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా పెట్టారు.

మే 29వ తేదీ నుంచి Realme GT 6T డివైజ్ సేల్ అమెజాన్ మరియు రియల్మీ ఈస్టోర్ ద్వారా ప్రారంభమవుతుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఫోన్ కొంటే రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ కొనేవారు Realme Buds Air 6 ని డిస్కౌంట్ ధర రూ.2,499 కి కొనవచ్చు.

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఫ్లూయిడ్ సిల్వర్ మరియు రేజర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 10-బిట్ ప్యానెల్, 1.5కే (2780*1264 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1600 నిట్స్ బ్రైట్నెస్, 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, డాల్బీ విజన్, ఎస్జీఎస్ ఏఐ ఐ-ప్రొటెక్షన్ స్క్రీన్, ఎస్జీఎస్ ఏ-గ్రేడ్ సన్‌లైట్-రీడబుల్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.

ప్రాసెసర్: Realme GT 6T లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూ వాడారు.

మెమొరీ: Realme GT 6T డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ LPDDR5X ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి UFS 4.0 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: Realme GT 6T డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కెమెరా: Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఎల్‌వైటీ600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 10 నిమిషాల సమయం పడుతుంది.

కనెక్టివిటీ: Realme GT 6T లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Realme GT 6T డివైజ్ 162 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.65 మి.మీ మందం, 191 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Realme GT 6T లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్ సెటప్, ఐపీ65 రేటింగ్, 9-లేయర్ ఐస్‌బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్, జీటీ మోడ్ 5.0, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.