Home News లీకైన Realme GT 7, OnePlus Ace 3 Pro ధర శ్రేణి, పూర్తి వివరాలు తెలుసుకోండి

లీకైన Realme GT 7, OnePlus Ace 3 Pro ధర శ్రేణి, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • త్వరలో Realme GT 7, OnePlus Ace 3 Pro లాంచ్
  • తాజాగా రివీలైన రెండు ఫోన్ల ప్రైస్ రేంజ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న ఫోన్లు

జులై నెలలో OnePlus, Realme బ్రాండ్స్ కి చెందిన రెండు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. రియల్మీ నుంచి Realme GT 7, వన్‌ప్లస్ నుంచి OnePlus Ace 3 Pro లాంచ్ కానున్నాయి. తొలుత ఈ డివైజెస్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. తాజాగా ఈ ఫోన్ల యొక్క ధర శ్రేణి రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Realme GT 7, OnePlus Ace 3 Pro ధర శ్రేణి

ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై రియల్మీ జీటీ 7 మరియు వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో డివైజెస్ యొక్క ధర శ్రేణిని రివీల్ చేశారు.

లీక్ ప్రకారం, జీటీ 7 మరియు ఏస్ 3 ప్రో ఫోన్ల ధరలు ఒకే విధంగా ఉండనున్నాయి. చైనాలో వీటి ధర 3000 యువాన్లు (సుమారు రూ.35,325) గా ఉంటుందని సమాచారం.

ఈ ధర శ్రేణిలో ఉత్తమమైన కెమెరాలతో రెండు ఫోన్లు రానున్నాయని టిప్‌స్టర్ తెలిపారు.

Realme GT 7, OnePlus Ace 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

లేటెస్ట్ లీక్ లో టిప్‌స్టర్ రియల్మీ జీటీ 7, వన్‌ప్లస్ ఏస్ 3 ప్రో ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయని అన్నారు.

ఈ రెండు ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

ఇంకా డిస్ప్లే సైజ్ రివీల్ కాలేదు. అయితే వీటిలో ఒక ఫోన్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుండగా, మరొక డివైజ్ 1.5కే రెజుల్యూషన్ గల కర్వ్డ్ స్క్రీన్ తో వస్తోంది.

రెండు స్మార్ట్‌ఫోన్లు 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ డివైజ్ కాస్త పెద్ద బ్యాటరీతో వస్తుండగా, రియల్మీ చార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ రియల్మీ, వన్‌ప్లస్ ఫోన్లు డెడికేటెడ్ గ్రాఫిక్స్ చిప్ మరియు కూలింగ్ సిస్టమ్ ఉంటాయి.