ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ టీయూవీ ఎస్‌యూడీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ యొక్క చార్జింగ్ మరియు కెమెరా డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.
Realme GT 7 Pro టీయూవీ ఎస్‌యూడీ, కెమెరా ఎఫ్‌వీ-5 వివరాలు
Realme GT 7 Pro డివైజ్ టీయూవీ ఎస్‌యూడీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యాయి. వీటి ద్వారా ఫోన్ యొక్క ఫాస్ట్ చార్జింగ్ మరియు కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.
Realme GT 7 Pro డివైజ్ 10 వాట్, 55 వాట్ మరియు 121 వాట్ చార్జర్స్ తో టెస్ట్ చేయబడినట్లు లిస్టింగ్ లో ఉంది. 3సీ లిస్టింగ్ లో కూడా 121 వాట్ చార్జర్ పేర్కొనబడి ఉంది.
మరోవైపు, Camera FV-5 డేటాబేస్ లో 50ఎంపి ఓఐఎస్-ఈఐఎస్ ప్రైమరీ కెమెరా, 4096*3072 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో రియల్మీ జీటీ7 ప్రో లిస్ట్ అయ్యింది.
Realme GT 7 Pro డివైజ్ 16ఎంపి ఈఐఎస్ ఫ్రంట్ కెమెరా, 2304*1728 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
Realme GT 7 Pro లాంచ్ టైమ్‌లైన్
నవంబర్ ఆరంభంలో Realme GT 7 Pro చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే, Realme GT 7 Pro డివైజ్ గత మోడల్ Realme GT 5 Pro కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వస్తోంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 లేదా 8 ఎలీట్ చిప్సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Realme GT 7 Pro డివైజ్ ఐపీ68 లేదా ఐపీ69 రేటింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. చైనా లాంచ్ తర్వాత, భారత్ సహా ఇతర మార్కెట్స్ లో ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అవుతుంది.
Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme GT 7 Pro లో 6.78-ఇంచ్ 1.5కే బీఓఈ ఎక్స్2 స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉంటాయి.
ప్రాసెసర్: Realme GT 7 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 లేదా 8 ఎలీట్ చిప్సెట్ ఉంటుంది.
రియర్ కెమెరా: Realme GT 7 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి.
సెల్ఫీ కెమెరా: Realme GT 7 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 121 వాట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఇతర ఫీచర్లు: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ ఐపీ68 లేదా ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
