ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో జీటీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ టైమ్‌లైన్ రివీల్ అయ్యింది. కంపెనీ టీజర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Realme GT 7 Pro ఇండియా లాంచ్
Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో లాంచ్ కానున్నట్లు కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ద్వారా వెల్లడించింది. అలాగే నవంబర్ నెలలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని కూడా తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ చిప్సెట్‌తో వస్తోన్న భారతదేశపు తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. అయితే డివైజ్ యొక్క లాంచ్ తేదీని రియల్మీ ఇంకా వెల్లడించలేదు.
Power that sets new benchmarks! 🚀
Introducing India’s first Snapdragon® 8 Elite in the upcoming #realmeGT7Pro. Brace yourselves for a next-gen experience, launching this November on @amazonIN.🔥#GT7ProFirst8EliteFlagship #DarkHorseofAI #ExploreTheUnexplored #amazonIndia pic.twitter.com/7JYa8VLuSP
— realme (@realmeIndia) October 21, 2024
ఇక స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఒరైన్ సీపీయూ స్ట్రక్చర్ కలిగి ఉంది. అడ్రెనో జీపీయూ, హెక్సాగన్ ఎన్‌పీయూ కలిగిన ఈ చిప్సెట్ ప్రపంచంలోనే వేగవంతమైన చిప్సెట్ అని రియల్మీ చెబుతోంది. ఈ ప్రాసెసర్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.32 గిగాహెర్ట్జ్. ఫోన్ పెర్ఫామెన్స్‌ను ఇది 45 శాతం మేర పెంచుతుంది. అలాగే ఈ చిప్ లో అడ్వాన్స్డ్ ఏఐ కేపబులిటీస్ కూడా ఉన్నాయి.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ చిప్సెట్ 320 మెగాపిక్సెల్స్ వరకు గల కెమెరాకు సపోర్ట్ చేస్తుంది. ఇది 8కే వీడియో రికార్డింగ్ చేయగలదు. ఈ చిప్సెట్ 24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, వై-ఫై 7, స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 5జీ మోడెమ్-ఆర్ఎఫ్ సిస్టమ్, ఫాస్ట్ కనెక్ట్ 7300 వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
Realme GT 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
స్క్రీన్: Realme GT 7 Pro లో శాంసంగ్ క్వాడ్ మైక్రో కర్వ్డ్ ఎల్టీపీవో డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
మెమొరీ: Realme GT 7 Pro డివైజ్ 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.
సాఫ్ట్‌వేర్: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళ పాటు ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
కెమెరా: Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 పెరిస్కోప్ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
బ్యాటరీ: Realme GT 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
