Home News Realme GT 7 Pro: భారీ బ్యాటరీతో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి

Realme GT 7 Pro: భారీ బ్యాటరీతో వస్తోన్న రియల్మీ జీటీ 7 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights
  • త్వరలో Realme GT 7 Pro లాంచ్
  • తాజాగా లీకైన బ్యాటరీ వివరాలు
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో జీటీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme GT 7 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme GT 7 Pro బ్యాటరీ వివరాలు

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

టిప్‌స్టర్ ప్రకారం, Realme GT 7 Pro 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు అర్థమవుతోంది.

అయితే డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో డివైజ్ పేరు పేర్కొనబడి లేదు. అయితే, టిప్‌స్టర్ వాడిన ఎమోజీని గమనిస్తే, రియల్మీ నుంచి రాబోవు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్ గల ఫోన్ Realme GT 7 Pro అని అర్థమవుతోంది.

డీసీఎస్ లీక్ ద్వారా కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. జీటీ 7 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ సెన్సర్, ఒక పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ69 రేటింగ్ తో వస్తోందని గతంలో బయటకు వచ్చిన కొన్ని లీక్స్ ద్వారా రివీల్ అయ్యింది.