హైలైట్స్:
- త్వరలో భారత్ లో లాంచ్ కానున్న రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్
- ఒరిజినల్ మోడల్ మాదిరి హార్డ్ వేర్ ని కలిగి ఉండనున్న రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్
- డైమెన్సిటీ 8100, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు

రియల్ మీ జీటీ నియో 3 కంపెనీ యొక్క ప్రీమియమ్ మిడ్ రేంజ్ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ తో వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఈ నెల మొదట్లో, రియల్ మీ జీటీ నియో 3 థోర్: లవ్ అండ్ థండర్ స్పెషల్ ఎడిషన్ ను రియల్ మీ లాంచ్ చేసింది. ఇప్పుడు టిప్ స్టర్ అభిషేర్ యాదవ్ చెబుతున్న దాన్ని బట్టి, రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. అయితే కచ్చితమైన తేదీ ఇంకా తెలియలేదు. ఈ నెలలో లేదా, వచ్చే నెల మొదట్లో ప్రకటన వచ్చే అవకాశముంది.
రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్, ఒరిజినల్ మోడల్ లో ఉన్న ఫీచర్లతోనే లాంచ్ అవుతోంది. కానీ, రియర్ ప్యానెల్ డిజైన్, కస్టమ్ వాల్ పేపర్, ఐకాన్స్ వంటి మార్పులున్నాయి.
Realme GT Neo 3 నరుటో ఎడిషన్
రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ ఏజీ గ్లాస్, ఆరెంజ్ కలర్ తో వస్తోంది. 17 నెలలు శ్రమించి నరుటో ఎడిషన్ యొక్క బ్యాక్ ప్యానెల్ ను తీర్చిదిద్దినట్లు రియల్ మీ చెబుతోంది. రిటైల్ బాక్స్ ప్యాకేజ్ నింజుట్సు స్క్రోల్ తో ర్యాప్ చేయబడి ఉంది. ఇది లెదర్ తో తయారు చేయడినది. 33 వాట్ పవర్ బ్యాంక్ కూడా నరుటో బ్రాండింగ్ తో వస్తోంది. అలాగే కస్టమ్ కేసెస్ కూడా ఉన్నాయి. అయితే ఇవి వేరుగా అమ్ముడవ్వనున్నాయి.
రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ మూడు క్లాసిక్ నరుటో వాల్ పేపర్స్, 84 యాప్ కస్టమ్ ఐకాన్స్, కస్టమ్ ఛార్జింగ్ యానిమేషన్స్ మరెన్నింటితోనే వస్తోంది.

Realme GT Neo 3 Naruto ఎడిషన్ స్పెసిఫికేషన్స్
- 6.7 అంగుళాల 10-బిట్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్
- 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ కస్టమ్ స్కిన్
- 50ఎంపి+8ఎంపి+2ఎంపి ట్రిపుల్ కెమెరాస్
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
- 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 10-బిట్ ప్యానెల్, సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరాల వివరాలు చూద్దాం. రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ లో వెనకాల మూడు కెమెరాలున్నాయి. వీటిలో ఒకటి 50 ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, మరొకటి 2ఎంపి మ్యాక్రో సెన్సర్. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు. ఇప్పుడు కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే, 5జీ, డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
రియల్ మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, జీటీ మోడ్ 3.0 ఉన్నాయి. 39606ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇది 4129ఎంఎం స్క్వేర్ వరకు ఏరియాను కవర్ చేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ అవ్వకుండా ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ దోహదపడుతుంది.











