Home News సెప్టెంబర్ 16 న భారత్ లో లాంచ్ కానున్న Realme GT Neo 3T

సెప్టెంబర్ 16 న భారత్ లో లాంచ్ కానున్న Realme GT Neo 3T

హైలైట్స్:

Realme GT Neo 3T ఇండియా లాంచ్ డేట్ రివీల్ అయ్యింది. ఎప్పుడో దేశంలో విడుదల కావాల్సిన ఈ ఫోన్ కొన్ని కారణాల వల్లన జాప్యమైంది. రీసెంట్ గా రియల్మీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫోన్ ని టీజ్ చేసింది. అలాగే తన అధికార వెబ్ సైట్ లో Realme GT Neo 3T యొక్క మైక్రోసైట్ ని ఉంచింది. ఇప్పుడు రియల్మీ ఫోన్ లాంచ్ డేట్ ని ప్రకటించింది. సెప్టెంబర్ 16 న Realme GT Neo 3T భారత్ లో లాంచ్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Realme GT Neo 3T అమ్మబడుతుంది. అలాగే రియల్మీ వెబ్ సైట్ ద్వారా కూడా Realme GT Neo 3T ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రియల్మీ క్యూ5 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Realme GT Neo 3T స్పెసిఫికేషన్స్

Realme GT Neo 3T లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 100 శాతం డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్, 106 పర్సెంట్ నెన్టీఎస్‌సీ కలర్ గేముత్, 16000-లెవెల్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, అడ్రెనో 650 జీపీయూ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆడియో ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో ఉన్నాయి. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఫోన్లో వీసీ కూలింగ్ ఫీచర్ అందించారు. ఫోన్ భద్రత కొరకు ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఇందులో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

ఇక కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme GT Neo 3T లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

భారత్ లో Realme GT Neo 3T ధర

Realme GT Neo 3T 8జిబి + 128జిబి మోడల్ గ్లోబల్ ప్రైస్ 470 డాలర్లు (దాదాపు రూ.36,600), 8జిబి + 256జిబి మోడల్ ధర 510 డాలర్లు (రూ.39,700) గా ఉంది. భారత్ లో ఫోన్ ధర కాస్త తక్కువగా ఉండే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.