హైలైట్స్
- భారత్ లో Realme GT Neo 3T ధర రూ.29,999 నుంచి ప్రారంభం
- 6.62-ఇంచ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి Realme GT Neo 3T సేల్ ప్రారంభం

Realme GT Neo 3T ఫోన్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ Realme GT Neo 3 కి అప్‌గ్రేడ్ వర్షన్ అని చెబుతున్నారు. Realme GT Neo 3 ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. Realme GT Neo 3T విషయానికి వస్తే, ఇందులో పంచ్ హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ట్రిపుల్ కెమెరాలు, రెక్టాంగ్యులర్ మాడ్యూల్, స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ప్లస్, రేసింగ్ ఫ్లాగ్ రియర్ ప్యానెల్ డిజైన్ ఉన్నాయి.
Realme GT Neo 3T లో 6.62-ఇంచ్ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్, 64ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
భారత్ లో Realme GT Neo 3T ధర, విక్రయ తేదీ, ఆఫర్స్
భారత్ లో Realme GT Neo 3T 6జిబి + 128జిబి ధర రూ.29,999 గా ఉంది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది. 8జిబి + 256జిబి మోడల్ ధర రూ.33,999 గా నిర్ణయించారు. డ్యాష్ యెల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, రియల్మీ వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్ ద్వారా Realme GT Neo 3T యొక్క మొదటి సేల్ ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్స్ ద్వారా Realme GT Neo 3T కొనుగోలు పై రూ.7000 డిస్కౌంట్ ని రియల్మీ ఆఫర్ చేస్తోంది. అంటే ఆఫర్ తో Realme GT Neo 3T ధర రూ.22,999 కి చేరనుంది.
Realme GT Neo 3T స్పెసిఫికేషన్స్
Realme GT Neo 3T లో 6.62-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ4 అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 శాతం డీసీఐ-పీ3 వైడ్ కలర్ గేముత్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 106 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్, 16000-లెవెల్ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్కమ్ స్నాడప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, అడ్రెనో 650 జీపీయూ, 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉన్నాయి.
Realme GT Neo 3T లో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. డాల్బి అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో, వీసీ కూలింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇందులో ఉన్నాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. Realme GT Neo 3T లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్ 162.9 మిల్లీ మీటర్ల పొడవు, 75.8 మిల్లీ మీటర్ల వెడల్పు,8.65 మిల్లీ మీటర్ల మందం, 194.5 గ్రాముల బరువు ఉంటుంది.












