హైలైట్స్
- నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ కానున్న Realme GT Neo 3T
- రూ.7,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ తో వస్తోన్న Realme GT Neo 3T
- 80 వాట్ చార్జింగ్ కలిగిన తక్కువ ధర కలిగిన ఫోన్లలో Realme GT Neo 3T ఒకటి

Realme నేడు Realme GT సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. Realme GT Neo 3T నేడు భారత్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన Realme GT Neo 3 ఫోన్ కి Realme GT Neo 3T అప్‌గ్రేడ్ వర్షన్ కాదు. దాని కంటే కాస్త తక్కువ స్థాయి ఫోన్. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో Realme GT Neo 3T వస్తున్నట్లు సమాచారం. మరి భారత్ లో ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ వివరాలను చూద్దాం పదండి.
Realme GT Neo 3T లాంచ్ ఈవెంట్ ప్రత్యక్షప్రసారాన్ని చూడటం ఎలా?
Realme GT Neo 3T నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ అవుతోంది. ఇది ఆన్‌లైన్ ద్వారా లాంచ్ అవుతోంది. లాంచ్ ఈవెంట్ లైవ్ ని రియల్మీ కంపెనీ తన యొక్క అఫీషియల్ యూట్యూబ్ చానల్ రియల్మీ ఇండియా ద్వారా ప్రసారం చేయనుంది. మీ లివింగ్ రూమ్ లో కూర్చొని ఈ ఈవెంట్ ని చూడవచ్చు. ఇక్కడ మేం అందిస్తోన్న ఎంబెడెడ్ లింక్ ద్వారా కూడా తిలకించవచ్చు.
భారత్ లో Realme GT Neo 3T అంచనా ధర, స్పెసిఫికేషన్స్
Realme GT Neo 3T కి సంబంధించిన పలు స్పెసిఫికేషన్స్ ని రియల్మీ సంస్థ గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో పాటు, Realme GT Neo 3T లో స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, అమోలెడ్ ఈ4 డిస్ప్లే, 1300 పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
Realme GT Neo 3T లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 64ఎంపి లెన్స్ అని తెలుస్తోంది. ఇక 16 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా Realme GT Neo 3T లో ఉండనుంది.
Realme GT Neo 3T రెండర్స్ ని బట్టి చూస్తే, ఫోన్ అచ్చంగా Realme GT Neo 2 లాగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈ ఫోన్ Realme GT Neo 2 మోడల్ కి అప్‌గ్రేడ్ అని భావించవచ్చు. అందుకే Realme GT Neo 3T, నియో 3 ఫోన్ కి సక్సెసర్ కాదని చెబుతున్నారు. నియో 3 లో ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే.
Realme GT Neo 3T గ్లోబల్ గా జూన్ లో లాంచ్ అయ్యింది. గ్లోబల్ ప్రైస్ 469.99 యూరోలు (రూ.39,000) గా ఉంది. భారత్ లో Realme GT Neo 3T ధర ఇంకా తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ తర్వాత రూ.7000 డిస్కౌంట్ లభిస్తుందని రియల్మీ ఇప్పటికే ప్రకటించింది.











