Home News 144Hz డిస్ప్లేతో వస్తోన్న Realme GT Neo 4

144Hz డిస్ప్లేతో వస్తోన్న Realme GT Neo 4

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్మీ త్వరలోనే Realme GT Neo 4 ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ని Redmi K60 కి పోటీగా బరిలోకి దింపనున్నట్లు సమాచారం. తాజాగా Realme GT Neo 4 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ టిప్‌స్టర్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ హ్యాండ్సెట్ 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సామాజిక మాధ్యమం అయిన వీబో లో Realme GT Neo 4 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. దీని ప్రకారం, Realme GT Neo 4 స్మార్ట్ ఫోన్ 1.5 కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ప్లే తో వస్తున్నట్లు తెలిసింది. ఈ ఫోన్ లో 2,160 హెర్ట్జ్ పల్స్-విడ్త్ మాడ్యులేషన్ (PWM) డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం. ఇంకా ఈ హ్యాండ్సెట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానుందని తెలుస్తోంది. అలాగే Realme GT Neo 4 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఆఫర్ చేయనుందట.

అయితే ఇప్పటి వరకు Realme నుంచి Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టులో రియల్మీ ఇండియా మరియు చైనా వెబ్‌సైట్స్ లో Realme GT Neo 4 దర్శనమిచ్చింది. ఇక ఆ తర్వాత మళ్ళీ కంపెనీ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన వార్త ఏదీ బయటకు రాలేదు. తాజాగా స్పెసిఫికేషన్స్ బయటకు రావడంతో త్వరలోనే Realme GT Neo 4 లాంచ్ ఉండనుందని స్పష్టమవుతోంది.

Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీకైన సమాచారాన్ని బట్టి, Realme GT Neo 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ (2,772*1,440), 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడే అవకాశం ఉంది. Realme GT Neo 4 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు Realme GT Neo 4 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme GT Neo 4 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 ఎంపి మెయిన్ కెమెరా, 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మ్యాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.