Home News 240వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన Realme GT Neo 5

240వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో చైనాలో లాంచైన Realme GT Neo 5

Highlights
  • చైనాలో లాంచైన Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్
  • రెండు వేరియంట్లలో వచ్చిన Realme GT Neo 5 హ్యాండ్సెట్
  • Realme GT 3 పేరుతో గ్లోబల్ గా లాంచ్ కానున్న Realme GT Neo 5

గత కొన్ని వారాలుగా నెట్టింట్లో Realme GT Neo 5 ఫోన్ హల్‌చల్ చేస్తోంది. కంపెనీ కూడా ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు Realme GT Neo 5 ని రియల్మీ సంస్థ చైనాలో లాంచ్ చేసింది. ఈ డివైజ్ 150 వాట్ చార్జింగ్ స్పీడ్ మరియు 240 వాట్ చార్జింగ్ స్పీడ్ తో వచ్చింది.

240 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన మొదటి రియల్మీ ఫోన్ ఇదే. అలాగే మరే ఇతర కంపెనీ కూడా ఈ ఫీచర్ గత ఫోన్ ని ఇప్పటి వరకు తీసుకురాలేదు. భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో రియల్మీ కంపెనీ ఈ డివైజ్ ని Realme GT 3 పేరుతో తీసుకురానుందని సమాచారం. రీసెంట్ గా రియల్మీ GT 3 స్మార్ట్ ఫోన్ ని తన ట్విట్టర్ హ్యాండిల్ పై టీజ్ చేసింది.

చైనాలో Realme GT Neo 5 ధర, లభ్యత

రియల్మీ సంస్థ Realme GT Neo 5 యొక్క రెండు వేరియంట్స్ ని లాంచ్ చేసింది. అవి: 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్. 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్ 8జిబి + 256జిబి మోడల్ ధర CNY (సుమారు రూ.30,500) గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర CNY 2699 (సుమారు రూ.32,900) గా ఉంది. 16జిబి + 256జిబి వేరియంట్ ధర CNY 2899 (సుమారు రూ.35,300) గా ఉంది.

240 వాట్ వేరియంట్ 16జిబి + 256జిబి మోడల్ ధర CNY 3199 (సుమారు రూ.39,000), 16జిబి + 1టిబి మోడల్ ధర CNY 3499 (సుమారు రూ.42,600) గా ఉంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. ఫిబ్రవరి 15 నుంచి చైనాలో అఫీషియల్ గా రియల్మీ సేల్ ని ప్రారంభించనుంది.

Realme GT Neo 5 స్పెసిఫికేషన్స్

Realme GT Neo 5 లో 6.7-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ యూహెచ్‌ఎఫ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 5000000:1 డైనమిక్ కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. కొత్త తరం ఫ్లాగ్షిప్ లుమినిసెంట్ మెటీరియల్ ని ఈ ఫోన్ లో వాడారు.

Realme GT Neo 5 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 16జిబి ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Realme GT Neo 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరా ఉంటుంది. 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రియల్మీ హైపర్‌షాట్ 2.0, టర్బో ‘రా’ లాస్ లెస్ ఇమేజ్ ఆల్గారిథమ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme GT Neo 5 240W వేరియంట్ లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి కేవలం 8 నిమిషాల సమయం తీసుకుంటుంది. 150 వాట్ వేరియంట్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ అవ్వడానికి 16 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ ఫోన్ లో ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బి అట్మాస్ డ్యూయల్ స్పీకర్స్, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఇంకా ఆర్జీబీ బ్రీథింగ్ లైట్ బ్యాక్ ప్యానెల్ పై ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.