144Hz OLED డిస్ప్లే, Snapdragon 8 Gen 2 చిప్‌తో రానున్న Realme GT Neo 5 Pro

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme GT Neo 5 Pro
  • 5200ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న డివైజ్
  • ప్రత్యేకాకర్షణగా నిలవనున్న సోని ఐఎంఎక్స్890 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ ఈ ఏడాది ఆరంభంలో GT Neo 5 ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ గ్లోబల్ గా GT 3 5G పేరుతో వచ్చింది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. తాజాగా Realme GT Neo 5 Pro ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 144 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సోని ఐఎంఎక్స్890 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తుందని సమాచారం.

Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా GT 3 Pro అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Realme GT Neo 5 Pro డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్

రానున్న కొన్ని వారాల్లో రియల్మీ సంస్థ Realme GT Neo 5 Pro డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు నెట్టింట్లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ డిజిటల్ స్టేషన్ ద్వారా స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. దాని ప్రకారం, Realme GT Neo 5 Pro డివైజ్ 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో రానుందని తెలుస్తోంది.

  • డిస్ప్లే: Realme GT Neo 5 Pro లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.
  • చిప్సెట్: ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉండవచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 5 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Realme GT Neo 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 100 వాట్ లేదా 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: Realme GT Neo 5 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.
Previous article90Hz డిస్ప్లే, Helio G88 చిప్సెట్‌తో లాంచైన Redmi 12
Next articleలీకైన Samsung Galaxy Z Fold 5 పూర్తి స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.