Realme GT Neo 5 Pro త్వరలో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. లీక్ ప్రకారం, Realme GT Neo 5 Pro డివైజ్ గత మోడల్ Realme GT Neo 3 కి సక్సెసర్ గా రానుందని తెలుస్తోంది. రీసెంట్ లీక్ ద్వారా Realme GT Neo 5 Pro డివైజ్ ప్రధాన హార్డ్‌వేర్ వివరాలు తెలిసాయి. ప్రముఖ టిప్‌స్టర్ DigitalChatStation తాజాగా Realme GT Neo 5 Pro బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్స్ వివరాలను బయటపెట్టింది.
Realme GT Neo 5 Pro బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వివరాలు
- Realme GT Neo 5 Pro డివైజ్ రెండు 2540mAh సెల్స్ కలిగిన 5000mAh బ్యాటరీతో వస్తోందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది.
- 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న Realme GT Neo 5 Pro డివైజ్.
- గత లీక్ లో డిజిటల్ చాట్ స్టేషన్.. ఈ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని తెలిపింది. అంటే, రెండు చార్జింగ్ ఆప్షన్స్ ఉంటాయని తెలుస్తోంది.
- గత మోడల్ Realme GT Neo 5 కూడా 240W మరియు 150W చార్జింగ్స్ ఆప్షన్స్ తో చైనాలో లాంచ్ అయ్యింది. ఇదే విధంగా Realme GT Neo 5 Pro కూడా రెండు చార్జింగ్ ఆప్షన్స్ ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Realme GT Neo 5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT Neo 5 Pro లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.
- చిప్సెట్: ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, అడ్రెనో జీపీయూ ఉండవచ్చు.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 5 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో రానుంది.
- బ్యాటరీ, చార్జింగ్: Realme GT Neo 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 100 వాట్ లేదా 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
- ఓఎస్: Realme GT Neo 5 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Realme GT Neo 5 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం ఒక రియల్మీ ఫోన్ RMX3820, RMX3823 అనే మోడల్ నంబర్స్ తో చైనాకు చెందిన MIIT సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ పై కనిపించింది. ఈ ఫోన్ Realme GT Neo 5 Pro అయ్యుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ హ్యాండ్సెట్ 2023 జులై లేదా ఆగస్టు నెలల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
