Realme GT Neo 5 SE చైనాలో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ Realme GT Neo 5 SE. ఈ కొత్త రియల్మీ ఫోన్ పంచ్-హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా, భారీ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో మూడు కెమెరా సెన్సర్స్ తో వచ్చింది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఈ ఫోన్ ఫ్లాషీ డిజైన్, గ్రేడియంట్ షేడ్ తో వచ్చింది. Realme GT Neo 5 SE 6.74-ఇంచ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 1టిబి స్టోరేజీ తో వచ్చింది.
Realme GT Neo 5 SE ధర
Realme GT Neo 5 SE డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ధర ఆర్ఎంబి 1,999 (సుమారు 23,900) గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధర ఆర్ఎంబి 2199 (సుమారు రూ.26,300) గా ఉంది. 12జిబి + 512జిబి యూనిట్ ధర ఆర్ఎంబి 2299 (సుమారు రూ.27,500) గా ఉంది. 16జిబి + 1టిబి యూనిట్ ధర ఆర్ఎంబి 2799 (సుమారు రూ.33,500) గా ఉంది.
Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్
- 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
- 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ
- 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాస్
- 16ఎంపి ఫ్రంట్ కెమెరా
- 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్
Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.
Realme GT Neo 5 SE లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme GT Neo 5 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి జీసీ02ఎం మైక్రోస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
