Home News లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 సిరీస్ స్పెసిఫికేషన్స్

లాంచ్ కి ముందు లీకైన Realme GT Neo 5 సిరీస్ స్పెసిఫికేషన్స్

హైలైట్స్

Realme సంస్థ జనవరి 5 న చైనాలో ఒక ఈవెంట్ ని నిర్వహించనుంది. తన నుంచి రాబోవు నెక్ట్స్ జనరేషన్ చార్జింగ్ టెక్నాలజీని కంపెనీ టీజ్ చేసింది. 2023 లో ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్లను రియల్మీ లాంచ్ చేయనుంది. 240 వాట్ సూపర్‌డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రియల్మీ ఇంట్రడ్యూస్ చేయనుంది.

రియల్మీ సంస్థ Realme GT Neo 5 లైనప్ లో రెండు ఫోన్లను లాంచ్ చేయనుంది. Realme GT Neo 5 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్ రూమర్ రాయుళ్ళ ద్వారా బయటకు వచ్చాయి. ఓసారి Realme GT Neo 5 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Realme GT Neo 5 గురించి మాకు తెలిసిన వివరాలు (లీక్డ్)

Realme GT Neo 5 డివైజ్ Realme GT Neo 3 ఫోన్ కి సక్సెసర్ గా వస్తోంది. లాంచ్ కి ముందు ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఈ లైనప్ లో రెండు ఫోన్లను లాంచ్ చేయాలని రియల్మీ సంస్థ భావిస్తోంది. అవి: Realme GT Neo 5, Realme GT Neo 5 Pro.

చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పై షేర్ కాబడిన వివరాలను తొలుత ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ గుర్తించాడు. దాని ప్రకారం, Realme GT Neo 5 డివైజ్ సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు సమాచారం. ఇదే సెన్సర్ ని ఒప్పో రెనో 9 సిరీస్, ఫైండ్ ఎన్2 సిరీస్ లో కూడా వాడారు. త్వరలో రానున్న వన్ ప్లస్ 11 లో కూడా ఈ సెన్సర్ ని వినియోగించినట్లు సమాచారం.

ఇంతేకాకుండా, రివీల్ అయిన పోస్టర్ ద్వారా Realme GT Neo 5 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ సిరీస్ తో రియల్మీ పరిచయం చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రో-మోడల్ ఈ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రం 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చే అవకాశం ఉంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మరోవైపు 240 వాట్ చార్జింగ్ వేరియంట్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

లీకైన డిజైన్ రెండర్ ద్వారా ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో మెయిన్ కెమెరాతో పాటు ఒక అల్ట్రావైడ్ కెమెరా, ఒక మ్యాక్రో సెన్సర్ ఉండే అవకాశం ఉంది.

Realme GT Neo 5 ఫోన్ 6.7-ఇంచ్ అమోలెడ్ 2కే డిస్ప్లే, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డివైజ్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఇందులో పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉంటుంది.

Realme GT Neo 5 లో ఆర్జీబీ లైటింగ్ మెకానిజమ్, ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటాయి. రియల్మీ ఈ ఫోన్ ని ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై లాంచ్ చేయనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.