Realme: లాంచ్‌కి ముందు లీకైన GT Neo 6 SE డిజైన్

Highlights

  • త్వరలో Realme GT Neo 6 SE లాంచ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 SE పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఇటీవలె OnePlus Ace 3V స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Realme GT Neo 6 SE డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.

లీకైన Realme GT Neo 6 SE డిజైన్

చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై Realme GT Neo 6 SE ఇమేజ్ షేర్ అయ్యిందని Gizmochina వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. లీకైన ఇమేజ్ ద్వారా Realme GT Neo 6 SE యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

లీకైన ఇమేజ్ ప్రకారం, Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడు కెమెరాలు మరియు ఫ్లాష్ లైట్ కెమెరా మాడ్యూల్ లో ఉన్నాయి.

అయితే తాజాగా లీకైన ఇమేజ్ Realme GT Neo 6 SE డివైజ్‌దేనని కచ్చితంగా చెప్పలేం. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (లీక్)

  • ప్రాసెసర్: Realme GT Neo 6 SE డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుందని రియల్మీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.
  • డిస్ప్లే: Realme GT Neo 6 SE లో 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్ ఉంటుందని సమాచారం. ఇది ఉత్తమమైన అనుభూతిని అందిస్తుంది.
  • బ్యాటరీ: Realme GT Neo 6 SE లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.
  • కెమెరా: Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో ఈ వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్

Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Realme GT Neo 5 SE లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Realme GT Neo 5 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి జీసీ02ఎం మైక్రోస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Previous articleXiaomi: భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Civi
Next articleRealme 12x 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.