ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 SE పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు రియల్మీ కన్ఫర్మ్ చేసింది. ఇటీవలె OnePlus Ace 3V స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Realme GT Neo 6 SE డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.
లీకైన Realme GT Neo 6 SE డిజైన్
చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై Realme GT Neo 6 SE ఇమేజ్ షేర్ అయ్యిందని Gizmochina వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. లీకైన ఇమేజ్ ద్వారా Realme GT Neo 6 SE యొక్క డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
లీకైన ఇమేజ్ ప్రకారం, Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడు కెమెరాలు మరియు ఫ్లాష్ లైట్ కెమెరా మాడ్యూల్ లో ఉన్నాయి.
అయితే తాజాగా లీకైన ఇమేజ్ Realme GT Neo 6 SE డివైజ్‌దేనని కచ్చితంగా చెప్పలేం. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (లీక్)
- ప్రాసెసర్: Realme GT Neo 6 SE డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుందని రియల్మీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.
- డిస్ప్లే: Realme GT Neo 6 SE లో 8టీ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్ ఉంటుందని సమాచారం. ఇది ఉత్తమమైన అనుభూతిని అందిస్తుంది.
- బ్యాటరీ: Realme GT Neo 6 SE లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- ఓఎస్: Realme GT Neo 6 SE స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.
- కెమెరా: Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో ఈ వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.
Realme GT Neo 5 SE స్పెసిఫికేషన్స్
Realme GT Neo 5 SE స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, డాల్బి అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.
Realme GT Neo 5 SE లో 6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 2772*1240 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Realme GT Neo 5 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి జీసీ02ఎం మైక్రోస్కోప్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
