ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Realme జీటీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ని లాంచ్ చేయనుంది. Realme GT Neo 6 SE పేరుతో వస్తోన్న ఈ ఫోన్ వచ్చే వారం చైనాలో లాంచ్ అవుతోంది. తర్వాత భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా రియల్మీ సంస్థ అఫీషియల్ గా Realme GT Neo 6 SE లాంచ్ ని కొత్త టీజర్ ద్వారా వెల్లడించింది. ఓసారి Realme GT Neo 6 SE టీజర్ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Realme GT Neo 6 SE టీజర్
Realme GT Neo 6 SE స్మార్ట్ఫోన్ వివరాలు చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో పై ప్రత్యక్షమయ్యాయి.
Realme GT Neo 6 SE టీజర్ ఇమేజ్ ని గమనిస్తే, అందులో డివైజ్ వచ్చే వారం లాంచ్ అవుతోందని పేర్కొనబడి ఉంది.
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ జెన్ 1 చిప్సెట్ తో ఈ డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత భారత్ సహా ఇతర మార్కెట్లలో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Realme GT Neo 6 SE స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT Neo 6 SE లో 6.78-ఇంచ్ బీఓఈ 8టీ ఎల్టీపీవో 1.5కే స్క్రీన్ ఉంటుంది. ఇది 2780*1264 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తోంది.
- ప్రాసెసర్: Realme GT Neo 6 SE లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Realme GT Neo 6 SE డివైజ్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ మరియు 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వస్తోంది. అయితే ఎన్నో మోడల్స్ లాంచ్ అవుతాయో ఇంకా స్పష్టత లేదు.
- కెమెరా: Realme GT Neo 6 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Realme GT Neo 6 SE లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Realme GT Neo 6 SE డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Realme GT Neo 6 SE లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
