కొత్త సంవత్సరం 2024 లో ఎన్నో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ విషయంలో Realme వెనకాలేమీ లేదు. ఈ బ్రాండ్ తాజాగా సోషల్ మీడియాలో పెరిస్కోప్ జూమ్ కెమెరాను టీజ్ చేసింది. ఇది తన తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ డివైజ్ కి సంబంధించిన అప్డేట్ అని స్పష్టమవుతోంది. కానీ, రియల్మీ సంస్థ ఫోన్ పేరును వెల్లడించలేదు. అయితే, పెరిస్కోప్ లెన్స్ తో వచ్చే డివైజ్ Realme 12 Pro+ అయ్యుంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. సరే, ఓసారి Realme పెరిస్కోప్ జూమ్ కెమెరా ఫోన్ యొక్క టీజర్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Realme ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ టీజర్ వివరాలు
It’s out?! #NoPeriscopeNoFlagship#StayTuned #realmeIndia pic.twitter.com/BkApiJm5mB
— realme (@realmeIndia) December 28, 2023
- Realme సంస్థ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ టీజర్ ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై విడుదల చేసింది.
- రియల్మీ తన టీజర్ కి ‘నో పెరిస్కోప్ నో ఫ్లాగ్షిప్’ అని క్యాప్షన్ ని జత చేసింది.
- 2024 జనవరి నెల మూడో వారం లేదా చివరి వారంలో Realme తన కొత్త స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది.
- టీజర్ ఇమేజ్ లో డివైజ్ పేరుని రియల్మీ వెల్లడించలేదు. కానీ, అది Realme 12 Pro+ అని అంతా అంచనా వేస్తున్నారు.
- ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో మిడ్-బడ్జెట్ రేంజ్ లో లాంచ్ అవుతుందని సమాచారం.
- రిపోర్ట్ ప్రకారం, ఈ ఫోన్ లో ఒమ్నివిజన్ ఒవి64బి పెరిస్కోప్ టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని తెలుస్తోంది.
Realme 12 Pro, Realme 12 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిజైన్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ డివైజెస్ లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది.
- ప్రాసెసర్: Realme 12 Pro మరియు Realme 12 Pro+ స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్, అడ్రెనో జీపీయూ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ పై ఈ చిప్ తయారైంది.
- కెమెరా: Realme 12 Pro డివైజ్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో 2x లెన్స్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు, Realme 12 Pro+ లో 64ఎంపి పెరిస్కోప్ 3x ఆప్టికల్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం.
