త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo 50i Prime

హైలైట్స్:

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న రియల్మీ నార్జో 50ఐ ప్రైమ్ స్మార్ట్ ఫోన్
  • కంపెనీ అధికార వెబ్ సైట్ పై కనిపించిన డెడికేటెడ్ మైక్రోసైట్
  • 6.5 అంగుళాల డిస్ప్లే, యూనిసాక్ టీ612 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

వరుసగా ప్రోడక్ట్స్ ని లాంచ్ చేస్తూ ఈ నెల రియల్మీ కంపెనీ బిజీ అయిపోయింది. నిన్నే భారత్ లో రియల్మీ సీ33, వాచ్ 3 ప్రో, బడ్స్ ఎయిర్ 3ఎస్ టీడబ్ల్యూఎస్ లను లాంచ్ చేసింది. ఇంకా తేదీ తెలియదు కానీ, త్వరలోనే రియల్మీ జీటీ నియో 3టీ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నట్లు రియల్మీ ప్రకటించింది. ఇప్పుడు రియల్మీ నార్జో సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. నార్జో 50ఐ ప్రైమ్ అనే పేరుతో వస్తున్న ఈ ఫోన్ త్వరలోనే దేశంలో అడుగు పెట్టనుంది. రియల్మీ అధికార వెబ్ సైట్ లో ఈ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది.

నార్జో సిరీస్ లో నార్జో 50ఐ ప్రైమ్ ఏడో డివైజ్. ఇదివరకు ఈ సిరీస్ లో రియల్మీ నార్జో 50 ప్రో 5జీ, నార్జో 50 5జీ, నార్జో 50ఏ ప్రైమ్, నార్జో 50, నార్జో 50ఐ, నార్జో 50ఏ ఫోన్లను లాంచ్ చేసింది. నార్జో 50ఐ ప్రైమ్ డివైజ్ ని సైలెంట్ గా అలీఎక్స్‌ప్రెస్ ద్వారా జూన్లో లాంచ్ చేసింది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ తేదీ వెల్లడి కానుంది.

Realme Narzo 50i Prime స్పెసిఫికేషన్స్

Realme Narzo 50i Prime లో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 88.7 పర్సెంట్ స్క్రీన్ – టు – బాడీ రేషియో, యూనిసాక్ టీ612 చిప్సెట్, 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ, ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 11, రియల్మీ బేస్డ్ ఆర్ ఎడిషన్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Realme Narzo 50i Prime లో 8ఎంపి రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5ఎంపి కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ 164.1 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీమీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 182 గ్రాములు బరువు ఉంటుంది.

ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఇందులో 4జీ వోల్టీ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్/గ్లోనాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

Realme Narzo 50i Prime ధర

Realme Narzo 50i Prime 3జిబి + 32జిబి మోడల్ ధరను 99.99 డాలర్లు (దాదాపు రూ.7,820) గా నిర్ణయించారు. 4జిబి + 64జిబి వేరియంట్ ధర 109.99 డాలర్లు (దాదాపు రూ.8,800) గా ఉంది. ఇకపోతే ఈ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleషాకింగ్ న్యూస్: Apple iPhone అమ్మకాలపై నిషేధం
Next articleనవంబర్ 1 న లాంచ్ అవుతోన్న చౌకైన Netflix ప్లాన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.