Home News Realme: ఎయిర్‌ జెశ్చర్ ఫీచర్‌తో లాంచైన Narzo 70 Pro 5G

Realme: ఎయిర్‌ జెశ్చర్ ఫీచర్‌తో లాంచైన Narzo 70 Pro 5G

Highlights
  • భారత్ లో Narzo 70 Pro 5G లాంచ్
  • 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 2000 నిట్స్ బ్రైట్నెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Narzo 70 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లుక్ మరియు డిజైన్ ఇదివరకే సోషల్ మీడియా ద్వారా రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ ధర రూ.20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. Realme Narzo 70 Pro 5G ఫోన్ ఎయిర్ జెశ్చర్ అనే కొత్త ఫీచర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Narzo 70 Pro 5G స్పెసిఫికేషన్స్

Realme Narzo 70 Pro 5G ధర

Realme Narzo 70 Pro 5G రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.19,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.21,999 గా పెట్టారు.

Realme Narzo 70 Pro 5G డివైజ్ బేస్ మోడల్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.1,000, టాప్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో యూజర్లకు 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.18,999 కే లభిస్తుంది. 256జిబి స్టోరేజీ మోడల్ రూ.19,999 కి లభిస్తుంది.

ఎర్లీబర్డ్ సేల్ నేడు సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ మరియు అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,299 విలువగల Realme Buds T300 ఇయర్ బడ్స్ ని రియల్మీ ఉచితంగా అందిస్తోంది.