ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో తన నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. ఈ డివైజ్ యొక్క బేస్ వేరియంట్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం.
Realme Narzo 70 Turbo 5G ధర, సేల్ వివరాలు
Realme Narzo 70 Turbo 5G యొక్క 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.16,999 గాపెట్టారు.
Realme Narzo 70 Turbo 5G యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.20,999 గా పెట్టారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కొనే వారికి రూ.2,000 కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో బేస్ వేరియంట్ రూ.14,999 కి, మిడ్ మోడల్ రూ.15,999 కి, టాప్ మోడల్ రూ.18,999 కి లభిస్తుంది.
సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, రియల్మీ.కామ్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి అందుబాటులో ఉంటుంది.
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ టర్బో యెల్లో, టర్బో పర్పుల్ మరియు టర్బో గ్రీన్ కలర్స్ లో లభిస్తుంది.
Realme Narzo 70 Turbo 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme Narzo 70 Turbo 5G లో 6.67-ఇంచ్ శాంసంగ్ ఈ4 ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 106 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గ్యామట్, 600 నిట్స్ నార్మల్, 1200 నిట్స్ హై బ్రైట్నెస్, ఏజీ డీటీ స్టార్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme Narzo 70 Turbo 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. మాలి జీ615 జీపీయూ గ్రాఫిక్స్ ఈ ఫోన్ లో అందించారు. వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అంటుటు బెంచ్ మార్క్ స్కోర్ 7,50,000 కి పైగా ఉంది.
ర్యామ్, స్టోరేజీ: Realme Narzo 70 Turbo 5G డివైజ్ 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఆప్షన్ ఉంది. దీంతో యూజర్లకు గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఒకేసారి 32 యాప్స్‌ని వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
కెమెరా: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo 70 Turbo 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
సాఫ్ట్‌వేర్: Realme Narzo 70 Turbo 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
కనెక్టివిటీ: Realme Narzo 70 Turbo 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme Narzo 70 Turbo 5G లో ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, రెయిన్‌వాటర్ టచ్ ఫీచర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఎయిర్ జెశ్చర్, ఫ్లాష్ క్యాప్సూల్, రీడింగ్ మోడ్, ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
