ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో నార్జో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Realme Narzo 70 Turbo 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదల కానుంది. ఇప్పుడు 91mobiles ఈ ఫోన్‌ని camera FV-5 ప్లాట్ఫామ్ పై గుర్తించింది. అలాగే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ ఫోన్ యొక్క ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ వివరాలు కూడా లభించాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Realme Narzo 70 Turbo 5G ర్యామ్, స్టోరేజీ మరియు కలర్స్
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ RMX5003 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది.
ఈ ఫోన్ పర్పుల్, యెల్లో మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Realme Narzo 70 Turbo 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి+128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి వేరియంట్స్ లో రానుంది.
Realme Narzo 70 Turbo 5G కెమెరా ఎఫ్‌వీ-5 లిస్టింగ్
కెమెరా ఎఫ్‌వీ-5 ప్లాట్ఫామ్ పై Realme Narzo 70 Turbo 5G డివైజ్ సేమ్ మోడల్ నంబర్ RMX5003 తో లిస్ట్ అయ్యింది.
Realme Narzo 70 Turbo 5G లో 12.6ఎంపి ఈఐఎస్ కెమెరా, ఎఫ్/1.9 అపర్చర్ ఉంటాయని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ సెన్సర్ 4096*3072 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. కంపెనీ ఈ డివైజ్‌ను 50ఎంపి ప్రైమరీ కెమెరాతో లాంచ్ చేయవచ్చు.
ఫోన్ ముందువైపున, 4ఎంపి ఈఐఎస్ కెమెరా ( ఎఫ్/2.5 అపర్చర్) ఉంటుందని తెలుస్తోంది. ఈ సెన్సర్ 2304*1728 రెజుల్యూషన్ గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. ఈ కెమెరాను రియల్మీ 8ఎంపి హై మెగాపిక్సెల్ కౌంట్ కెమెరాగా మార్కెట్ చేసే అవకాశం ఉంది.
