Home News 64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N55

64ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Realme Narzo N55

Highlights
  • 33 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Realme Narzo N55
  • మినీ-క్యాప్సూల్ డిస్ప్లే తో మార్కెట్ లోకి వచ్చిన డివైజ్
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Realme Narzo N55

రియల్మీ సంస్థ తన నెక్ట్స్ జనరేషన్ నార్జో ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ కంపెనీ కొత్త ఫోన్ ని Realme Narzo N55 అనే పేరుతో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ ఒక 4జీ డివైజ్. కానీ, ఈ ఫోన్ లో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఆపిల్ పరిచయం చేసిన డైనమిక్ ఐల్యాండ్ వంటి మినీ క్యాప్సూల్ ఫీచర్ ని ఈ ఫోన్ ద్వారా రియల్మీ తీసుకొచ్చింది. ఈ క్యాప్సూల్ లో నోటిఫికేషన్స్, బ్యాటరీ స్టేటస్ తదితర ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చు. సరే, ఓసారి Realme Narzo N55 ధర, స్పెసిఫకేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Narzo N55 సేల్ వివరాలు

రియల్మీ సంస్థ Realme Narzo N55 ని రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ప్రైమ్ బ్లూ మరియు ప్రైమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 18 నుంచి Realme Narzo N55 ఫస్ట్ సేల్ మొదలవుతుంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్స్ కార్డ్స్ ద్వారా బేస్ మోడల్ పై రూ.500, టాప్ మోడల్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.

దీంతో పాటు, రియల్మీ కంపెనీ రేపు Realme Narzo N55 స్పెషల్ ఫ్లాష్ సేల్ ని తీసుకొస్తోంది. ఏప్రిల్ 13 న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ మరియు రియల్మీ వెబ్ సైట్స్ ద్వారా రూ.1000 వరకు డిస్కౌంట్ తో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

Realme Narzo N55 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Realme Narzo N55 లో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. ఈ హ్యాండ్సెట్ మినీ క్యాప్సూల్ ఫీచర్ తో వచ్చింది. ఆపిల్ తీసుకొచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ స్పూర్తితో ఈ మినీ క్యాప్సూల్ ఫీచర్ వచ్చింది. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, నోటిఫికేషన్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు. అయితే, ఇదివరకు ఇదే ఫీచర్ కంపెనీ రియల్మీ సీ55 డివైజ్ లో ఇచ్చింది.

Realme Narzo N55 లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ ఎడ్జ్, 91.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 680 నిట్స్ బ్రైట్నెస్ మరియు 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్ మరియు స్టోరేజీ

Realme Narzo N55 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 6జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఈఎంఎంసీ 5.1 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

డైనమిక్ ర్యామ్ ద్వారా 12జిబి వరకు ర్యామ్ ని పొందవచ్చు. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్-వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

కెమెరా

Realme Narzo N55 లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ మరియు ఓఎస్

Realme Narzo N55 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అందించారు. 29 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 50 శాతం చార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.