Home News వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55; రివీలైన మెమొరీ, కలర్ వేరియంట్స్

వచ్చే నెలలో భారత్ లో లాంచ్ కానున్న Realme Narzo N55; రివీలైన మెమొరీ, కలర్ వేరియంట్స్

Highlights
  • నార్జో బ్రాండింగ్ పై భారత్ లో ఎన్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనున్న రియల్మీ
  • లైనప్ లో రానున్న మొదటి డివైజ్ Realme Narzo N55
  • రివీలైన Realme Narzo N55 యొక్క మెమొరీ మరియు కలర్ వేరియంట్స్

రియల్మీ సంస్థ రీసెంట్ గా ఎన్-సిరీస్ ప్రొడక్ట్ వస్తోందంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ పై టీజ్ చేసింది. అయితే సదరు బ్రాండ్ ఏ డివైజ్ రానుందని వెల్లడించలేదు. ఈలోపు 91మొబైల్స్ రియల్మీ నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ల గురించి ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని రాబట్టింది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, రియల్మీ టీజ్ చేసిన ఫోన్ మోడల్ Realme Narzo N55 అని తెలుస్తోంది. నార్జో బ్రాండింగ్ లో కంపెనీ నుంచి వస్తోన్న కొత్త ఫోన్ ఇదే కానుంది. ఇకపోతే ఈ ఫోన్ కి సంబంధించిన మెమొరీ ఆప్షన్స్, కలర్ ఆప్షన్స్ వివరాలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

Realme Narzo N55 మెమొరీ, కలర్ వేరియంట్స్

సోర్స్ ప్రకారం, రియల్మీ సంస్థ త్వరలోనే నార్జో బ్రాండింగ్ పై కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. 2023 ఏప్రిల్ ద్వితీయార్థంలో Realme Narzo N55 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ప్రైమ్ బ్లాక్ మరియు ప్రైమ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని సమాచారం. ఈ డివైజ్ వివిధ మెమొరీ ఆప్షన్స్ లో లభించనుంది. మొత్తం 4 స్టోరేజీ వేరియంట్స్ లో రియల్మీ నార్జో ఎన్55 డివైజ్ లభిస్తుంది. బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో దొరుకుతుంది.

Realme Narzo N55 డివైజ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లో కూడా లభించనుంది. మిడ్ రేంజ్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 64/128జిబి స్టోరేజీ తో లభిస్తుందని అంచనా. చివరగా, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

Realme Narzo N55 ఇతర స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి తెలియదు. అయితే Realme Narzo N55 డివైజ్ మిడ్ రేంజ్ ఫోన్ అని అంచనా వేయవచ్చు. Realme Narzo N55 కి సంబంధించిన మరింత సమాచారం రానున్న కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అప్పుడు మీకు మరింత సమాచారం అందజేస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.