Realme Narzo N63: భారత్‌లో లాంచైన నార్జో ఎన్63, పూర్తి వివరాలు తెలుసుకోండి

Highlights

  • నేడు భారత్‌లో Realme Narzo N63 లాంచ్
  • 90 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా
  • జూన్ 10 నుంచి సేల్ ప్రారంభం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారత్ లో నార్జో సిరీస్ లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. Realme Narzo N63 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లో-బడ్జెట్ సెగ్మెంట్‌ను ఉద్దేశించి తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి. ఓసారి రియల్మీ నార్జో ఎన్63 యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Realme Narzo N63 ధర, లభ్యత

Realme Narzo N63 స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలను తెలుసుకుందాం.

Realme Narzo N63 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.8,499 గా నిర్ణయించారు.

Realme Narzo N63 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. జూన్ 10వ తేదీ నుంచి అమెజాన్ మరియు రియల్మీ ఈస్టోర్ ద్వారా ఈ హ్యాండ్సెట్ సేల్స్ మొదలవుతాయి.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Realme Narzo N63 డివైజ్ పై రూ.500 కూపన్ డిస్కౌంట్ అందిస్తున్నారు. పదివేల రూపాయల లోపు ధరలో ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

Realme Narzo N63 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo N63 లో 6.74-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo N63 లో UniSoc T612 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: Realme Narzo N63 4జిబి ర్యామ్, 4జిబి డైనమిక్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తోంది.

కెమెరా: Realme Narzo N63 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Realme Narzo N63 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme Narzo N63 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme Narzo N63 లో ఐపీ54 రేటింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సేఫ్ ఫాస్ట్-చార్జింగ్ సిస్టమ్ సర్టిఫికేషన్, ఎయిర్ జెశ్చర్స్, మినీ క్యూప్సూల్ 2.0, డైనమిక్ బటన్, గేమ్ స్పేస్, అల్ట్రా బూమ్ స్పీకర్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

బరువు, మందం: Realme Narzo N63 డివైజ్ 189 గ్రాముల బరువు, 7.74 మి.మీ మందం ఉంటుంది.

Previous articleTECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు
Next articleiQOO 13: లీకైన ఐకూ 13 స్పెసిఫికేషన్స్, త్వరలో లాంచ్ కానున్న డివైజ్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.