Home News Realme Narzo N65 5G: 120Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్

Realme Narzo N65 5G: 120Hz డిస్ప్లేతో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్

Highlights
  • నేడు భారత్ లో Realme Narzo N65 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.11,499

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు నార్జో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme Narzo N65 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్‌ని ఎంట్రీ లెవెల్ 5జీ కస్టమర్ల కోసం తీసుకొచ్చారు. ఈ ఫోన్ రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 128జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Realme Narzo N65 5G ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme Narzo N65 5G ధర

Realme Narzo N65 5G డివైజ్ 2 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Realme Narzo N65 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.11,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది. ఈ ఫోన్ పై ప్రారంభ సేల్‌లో భాగంగా రూ.1,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్ అంబర్ గోల్డ్ మరియు డీప్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మే 31 నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo N65 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme Narzo N65 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, 720*1604 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Realme Narzo N65 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Realme Narzo N65 5G డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. 6జిబి డైనమిక్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో కస్టమర్ కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Realme Narzo N65 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Realme Narzo N65 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Realme Narzo N65 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Realme Narzo N65 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 సర్టిఫికేషన్ ఉన్నాయి.