ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో Realme Note 50 అనే ఫోన్‌ని లాంచ్ చేయనుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై RMX3834 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. తాజాగా Realme Note 50 డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Realme Note 50 యొక్క గీక్‌బెంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్, ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Realme Note 50 గీక్‌బెంచ్ లిస్టింగ్
- Realme Note 50 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై RMX3834 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Realme Note 50 డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 424 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1478 పాయింట్లు నమోదు చేసింది.
- Realme Note 50 డివైజ్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- ఇంకా Realme Note 50 ఫోన్ 4జిబి ర్యామ్ తో లిస్టింగ్ పై కనిపించింది.
- Realme Note 50 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
Realme Note 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme Note 50 లో 6.67-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme Note 50 లో UniSoc T612 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
- కెమెరా: Realme Note 50 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 0.8ఎంపి సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Realme Note 50 లో పవర్ బ్యాకప్ కోసం 4890 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ర్యామ్: Realme Note 50 డివైజ్ 4జిబి ర్యామ్ ని ఆఫర్ చేయనుంది. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియదు.
Realme Note 50 ధర (అంచనా)
Realme Note 50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, ఈ డివైజ్ ధర రూ.8,000 వద్ద ఉంటుందని అంచనా వేయవచ్చు.
