Realme: రివీలైన Realme P1, P1 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్, ఏప్రిల్ 15న లాంచ్!

Highlights

  • ఏప్రిల్ 15న రియల్మీ పీ1, పీ1 ప్రో లాంచ్
  • పీకాక్ గ్రీన్ కలర్ లో వస్తోన్న Realme P1
  • ప్యారట్ బ్లూ, ఫీనిక్స్ రెడ్‌లో రానున్న P1 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో పీ-సిరీస్ లాంచ్ కాబోతోంది. ఈ సిరీస్ ఏప్రిల్ 15వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా రియల్మీ వెల్లడించింది. ఈ లైనప్ లో Realme P1, P1 Pro అనే రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. నేడు ఈ ఫోన్ల యొక్క డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme P1 డిజైన్, కలర్ ఆప్షన్స్

Realme P1 స్మార్ట్‌ఫోన్ రియల్మీ వెబ్‌సైట్ పై పీకాక్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లిస్ట్ అయ్యింది.

డివైజ్ ఇమేజ్ ని గమనిస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ బ్యాక్ ప్యానెల్ ఉన్నట్లు తెలుస్తోంది. 50ఎంపి మెయిన్ కెమెరా Realme P1 లో ఉంటుందని సమాచారం

వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంటుందని తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోన్న Realme P1 మైక్రోసైట్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, టాప్ లో మైక్రోఫోన్ కనిపిస్తున్నాయి. ఇంకా యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, మైక్రోఫోన్ బాటమ్ లో ఉన్నాయి.

Realme P1 Pro డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

టాప్ మోడల్ Realme P1 Pro ప్యారట్ బ్లూ మరియు ఫీనిక్స్ రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఈ డివైజ్ ముందు, వెనుకాల కర్వ్డ్ కార్నర్స్ కలిగి ఉంది. బ్లూ కలర్ వేరియంట్ సిల్వర్ ఛాసిస్, రెడ్ కలర్ వేరియంట్ గోల్డెన్ కలర్ ఛాసిస్ కలిగి ఉన్నాయి.

ప్రో వేరియంట్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, మూడు కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

ఫ్రంట్ ప్యానెల్ విషయానికి వస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Realme P1, Realme P1 Pro ధర శ్రేణి

ఏప్రిల్ 15వ తేదీన Realme P1 మరియు Realme P1 Pro డివైజెస్ యొక్క ధరలు రివీల్ అవుతాయి. కానీ, ఫ్లిప్‌కార్ట్ పై విడుదలైన టీజర్ ద్వారా Realme P1 ధర రూ.15,000 ఉంటుందని తెలుస్తోంది. Realme P1 Pro ధర రూ.20,000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్లు ఎన్ని మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానున్నాయో చూడాలి.

Realme P1 స్పెసిఫికేషన్స్

Realme P1 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ తో వస్తోందని ఖరారైంది. ఈ చిప్సెట్ అంటుటు పై 6 లక్షలకు పైగా స్కోర్ చేసింది.

Realme P1 ఫోన్ 7-లేయర్ వీసీ కూలింగ్ సిస్టమ్ (4356.62 మి.మీ వేపర్ చాంబర్) తో వస్తోంది.

Realme P1 డివైజ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 2000 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఇంకా Realme P1 లో ఐపీ54 రేటింగ్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్, రెయిన్‌వాటర్ టచ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

Realme P1 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు మైక్రోసైట్ ద్వారా ఖరారైంది.

ఈ డివైజ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, ప్రో-ఎక్స్‌డీఆర్, 2000 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడ్ల్యూఎమ్ డిమ్మింగ్, 2.32ఎంఎం బాటమ్ బెజెల్ తో వస్తోంది.

Realme P1 Pro లో 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్, టాక్టైల్ ఇంజిన్ ఉంటాయి.

Realme P1 Pro డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. ఈ ఫోన్ రెయిన్ వాటర్ టచ్, ఐపీ65 రేటింగ్ తో వస్తోంది.

Previous articleSamsung: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన Galaxy M35, F35
Next articleRedmi 13C 5G ఫోన్‌ పై డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.