ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో పీ1 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Realme P1 Speed 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌ని ప్రత్యేకించి గేమింగ్ లవర్స్ మరియు హెవీ యూజర్ల కోసం తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్, 12జిబి ర్యామ్, ఓఎల్ఈడీ స్క్రీన్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme P1 Speed 5G ధర మరియు లభ్యత
- Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.20,999 గా పెట్టారు.
- లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా అక్టోబర్ 20వ తేదీ నుంచి రియల్మీ పీ2 స్పీడ్ 5జీ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
Realme P1 Speed 5G డిజైన్
Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ చూసేందుకు గత మోడల్ పీ1 మరియు పీ1 ప్రో మాదిరే ఉంది. బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ కార్నర్స్ ఉన్నాయి. ముందువైపు, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ బ్రష్డ్ బ్లూ మరియు టెక్షర్డ్ టైటానియమ్ కలర్స్ లో లభిస్తుంది.
Realme P1 Speed 5G డివైజ్ 161.7 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.
Realme P1 Speed 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme P1 Speed 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ ఈస్పోర్ట్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ లోకల్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1080*2400 ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 92.65% స్క్రీన్ టు బాడీ రేషియో, 16.7 మిలియన్ కలర్స్, రెయిన్ వాటర్ టచ్ ఫీచర్ ఉన్నాయి.
చిప్సెట్: Realme P1 Speed 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్సెట్ వాడారు. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఈ చిప్సెట్ అంటుటు స్కోర్ 7,50,000+ గా నమోదైనట్లు కంపెనీ చెబుతోంది.
ర్యామ్, స్టోరేజీ: Realme P1 Speed 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 14జిబి వరకు డైనమిక్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి గరిష్టంగా 26జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Realme P1 Speed 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.8 అపర్చర్), ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Speed 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Realme P1 Speed 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.
కనెక్టివిటీ: Realme P1 Speed 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme P1 Speed 5G లో ఐపీ65 ప్రొటెక్షన్ ఉంది. దీని వల్లన నీరు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో జీటీ మోడ్ ఉంది.
